![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ మీద "అందాల రాక్షసి" మూవీతో నవీన్ చంద్ర ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఈ మూవీ హిట్ కొట్టేసరికి అతనికి ఎంతో మంచి పేరు వచ్చింది. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ తో ఎంతో మంది ఫాన్స్ ని కూడా సంపాదించుకున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో నవీన్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. హీరోగానే చేయాలి అని కాకుండా ఏ పాత్రైనా చేయడానికి రెడీ అయిపోవడంతో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు నవీన్ చంద్ర. ఇక రీసెంట్ గా "మంత్ ఆఫ్ మధు" మూవీలో స్వాతితో కలిసి నటించాడు. అలాంటి నవీన్ చంద్రకి ఒక అమ్మాయి అండర్ వేర్ ఇచ్చి మరీ ప్రొపోజ్ చేసిందట. ఆ విషయాల గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
హోస్ట్ రీతూ చౌదరి అడుగుతూ "వాచ్ ఇచ్చో, ఫ్లవర్స్ ఇచ్చో ప్రపోజ్ చేస్తారని తెలుసు కానీ మీకు ఎవరో అమ్మాయి అండర్ వేర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసిందట నిజమేనా ?" అనేసరికి "అండర్ వేర్ ఇస్తే పర్లేదు కానీ చాలా ఇచ్చారు. నేను అందాల రాక్షసి మూవీ హిట్ కొట్టాక కొంత అమౌంట్ కూడబెట్టుకుని నేను వైట్ కలర్ స్విఫ్ట్ కార్ కొనుక్కున్నాను. ఆ కార్ నాది అని తెలిసి లిప్ స్టిక్ తో కార్ మీద సూర్య అని రాసి ఫ్లవర్స్, అండర్ వేర్ ఇచ్చి , మోకాళ్ళకు పెట్టుకునే నీ-క్యాప్, ఇంకోటి కూడా ఇచ్చారు. దాన్ని చెప్పకూడదు కానీ మెడికల్ షాప్ లో దొరుకుతుంది" అంటూ ఇండైరెక్ట్ గా కండోమ్ అంటూ హింట్ ఇచ్చేసాడు. "ఇవన్నీ ఇవ్వడం వలన నేను ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. నాకు పురాతన ఆలయాలు అంటే చాలా ఇష్టం..అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నాకు బాలయ్య అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. ఇదివరకు బాగా స్మోక్ చేసేవాడిని కానీ ఇప్పటికి ఏడేళ్లయ్యింది ఆపేసి..మీరెవరూ కూడా స్మోక్ లాంటిది అస్సలు చేయొద్దు." అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు నవీన్ చంద్ర.
![]() |
![]() |